ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్ ఏపీ’ పేరుతో కొత్త పథకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్ మిషన్ ‘బిల్డ్ ఏపీ’ పేరు పెట్టారని నారా లోకేశ్ మండిపడ్డారు.
ఈ కార్యక్రమం పేరు ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కాదని ‘జగన్ కిల్డ్ ఏపీ’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జగన్ ఉన్మాది కొడుకులా వ్యవహరిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంటే జగన్ మాత్రం దోపిడీకి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మండిపడ్డారు.