Site icon TeluguMirchi.com

లక్ష్మీపార్వతికి పదవి రెడీ చేసిన సీఎం జగన్‌?

ఏపీ సీఎం జగన్‌ నా అనుకున్న వారికి, తనకు మొదటి నుండి అండదండగా ఉంటూ వచ్చిన వారికి, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూ వస్తున్నాడు. తన అనుకున్న వారికి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు నామినేటెడ్‌ పదవులు ఇచ్చుకోవడం చాలా కామన్‌గా చూస్తూ వస్తున్నాం. ఎంతో మంది వైకాపా నాయకులు ఇప్పటికే నామినేటెడ్‌ పదవులు దక్కాయి. రోజాకు మంత్రి పదవి దక్కక పోవడంతో ఆమె చేసిన సేవకు గాను ఒక పదవి క్రియేట్‌ చేసి మరీ ఆమెను సీఎం జగన్‌ గౌరవించడం జరిగింది. పృథ్వీ మరియు అలీలకు మంచి పోస్ట్‌లు ఇచ్చిన జగన్‌ త్వరలో ఎన్టీఆర్‌ రెండవ భార్య అయిన లక్ష్మీ పార్వతికి ఒక పదవి కట్టబెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తన క్యాంప్‌ అధికారులకు లక్ష్మి పార్వతికి ఏ పదవి అయితే బాగుంటుందో దాన్ని క్రియేట్‌ చేయాల్సిందిగా జగన్‌ ఆదేశించారంటూ పొలిటికల్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే క్రియేట్‌ చేయడానికి అదేం వస్తువు కాదని, ఒక మంచి గౌరవం ఉండే పదవి, ఇప్పటికే ఉన్న పదవిని లక్ష్మీ పార్వతికి ఇచ్చేందుకు జగన్‌ సిద్దం అవుతున్నట్లుగా వైకాపా నాయకులు కొందరు అంతర్ఘతంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి లక్ష్మీ పార్వతికి మాత్రం పదవి ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version