కియా కంపెనీ ప్రతినిధులు ఇంకా కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను ఇవ్వాల్సిందిగా అక్కడే హెచ్చరించినట్లుగా మాధవ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సంఘటనలో గోరెంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ప్రభుత్వం మరియు పార్టీ పరువు పోయేలా మాట్లాడటంతో పాటు ప్రతిష్టాత్మక కంపెనీ అయినా కియాను బెదిరించినట్లయ్యిందని జగన్ కూడా భావిస్తున్నాడట. అందుకే ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదంటే సీరియస్‌గా మందలించడం చేస్తున్నాడట.