ఛత్తీస్‌గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. అమరులైన విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు.
Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు ఛత్తీస్‌గఢ్ ఘటన : ఏపీ చెందిన అమర జవాన్ల కుటుంబాలకు 30 లక్షల ఆర్ధిక...