రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్ అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు .