భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనా చౌదరి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. గత కొద్దీ కాలంగా అధికార పార్టీ లో క్రింది స్థాయి కార్యకర్తలు అత్యుత్సాఅహానికి పోయి ప్రతిపక్ష పార్టీ మరియు ఇతర పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవని సీఎం జగన్ కి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన హేండిల్ లో ఇలా రాసుకొచ్చారు …
విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు అరాచకానికి పరాకాష్ట. అధికార పార్టీ నేతల పేర్లతో బెదిరింపులను సీఎంగారు తక్షణం అరికట్టాలి. బాధితులు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి, కాపీని నాకు పంపండి. మీకు అండగా ఉంటా.
మెయిల్ ఐడి [email protected]