జైల్లోకి.. వైఎస్ కేబినెట్..!

kiran-ministers-300x205జగన్ అక్రమాస్తుల కేసులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఛార్జిషీట్ నమోదయిన నేపథ్యంలో.. ఆంధ్రపదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. క్లిష్టమైన జగన్ అక్రమాస్తుల కేసులో.. హోం మంత్రితో పాటుగా వైఎస్ కేబినేట్ లోని మిగతా సహచర మంత్రులందరి పాత్ర కూడా ఉందనే అనుమానాలు వెలువెత్తున్నాయి.
సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయస్థానానికి దాఖలు చేసిన అయిదవ ఛార్జిషీట్ లో హోం మంత్రి సబితను ఏ4 నిందితురాలిగా పేర్కొన్న నేపథ్యంలో.. మంత్రులందరికీ.. ముఖ్యంగా వైఎస్ ఆర్ కేబినేట్ లోని సహచర మంత్రులందరిపై త్వరలోనే సీబీఐ ఉచ్చు బిగించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులు.. మోపిదేవి, ధర్మాన, తాజాగా సబితలు జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిగిలిన పొన్నాల లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, జానారెడ్డి, బొత్స మరియు కన్నా లక్ష్మీ నారాయణలు తదితరులపై జగన్ కేసులో సీబీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

జగన్ కేసులో హోంమంత్రి సబితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. సీఎంతో మంత్రులందరు ఈ విషయంపై సీరియస్ గా చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ కేబినెట్ లోని మంత్రులందరిపై ఒక్కొక్కరిగా ఛార్జిషీట్ నమోదవుతున్న తరుణంలో.. ఈ సమావేశం పాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ చేసిన జీవోలకు ఇప్పుడు మంత్రులు బలైపోతున్నారని సమావేశంలో కొంతమంది వాపోయినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ కేబినెట్ మొత్తం జైలుపాలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.