Site icon TeluguMirchi.com

వైసీపీ ఎమ్మెల్యే ఫై ఓ రేంజ్ లో మండిపడుతున్న నెటిజన్లు

రీసెంట్ గా విశాఖపట్నం లో ఘోర గ్యాస్ లీక్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ లీకేజ్ కారణంగా 12 మంది మరణించగా ..వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన పట్ల రాజకీయ దుమారం నడుస్తుంది. ఈ నేపదాయంలో వైసీపీ మ్మెల్యే నోరు జరపడం ఫై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ న్యూస్ ఛానల్ డిబేట్‌‌లో పాల్గొన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి మాటలు అనకూడదేమో అంటూనే నోరు జారారు. ‘అయ్యో మా వాళ్ళు కూడా చచ్చిపోతే బాగుండే మాకు కోటి రూపాయలు వచ్చేవి అని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఫై నెటిజన్లు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మహిళా నేత రేవతి తప్పుబట్టారు.. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవిలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.

Exit mobile version