తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేనలో చేరారు. P.గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ K. కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యలకు పవన్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి, విజయనగరంజిల్లాల్లో పార్టీ బలోపేతానికి నూతనంగా చేరిన నాయకులు కృషి చేయాలని పవన్ సూచించారు