మద్యం షాపులు ఓపెన్ చేయడం పట్ల యామిని ఫైర్ ..

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు బాబులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. తాజాగా కేంద్రం పొడిగించిన లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చింది. వాటిలో మద్యం షాపులు కూడా. ఈరోజు నుండి అన్ని జోన్ల లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో మాత్రం మద్యం షాపులు ఓపెన్ కావడం తో పాటు వాటి ధరలను పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల బీజేపీ నేత యామిని శర్మ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో మద్యం షాపులు తెరిస్తే… కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆదాయం కోసం కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయని యామిని శర్మ చెప్పారు. కేంద్రం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినా రాష్ట్రాలు ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. మద్యం షాపుల వద్ద గుంపులుగా ఉండటానికి వీల్లేద.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఒక్కో విడతలో కేవలం ఐదుగురినే మద్యం షాపుల్లోకి అనుమతిస్తారు.