బంగాళఖాతంలో ఏర్పడిన యాస్ తుపానుపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, అమిత్ షాతో మాట్లాడి పలు వివరాలు తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసారు. కాగా, ఈ సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి కూడా పాల్గొన్నారు. అలాగే, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ అధికారులు కూడా పాల్గొన్నారు.