మహిళలు గీత దాటితే దెబ్బతింటారు! : వార్గియా

mp-minister-vargiyaమహిళలు గీత దాటితే విపత్కర పరిస్థితులు తప్పవంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ వార్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. “లక్ష్మణ రేఖ దాటినందుకే సీతను రావణుడు అపహరించాడు. మహిళలు గీత దాటితే వారిని కబళించడానికి రావణాసురులు బయట పొంచి ఉంటారు” అని భాజాపా మంత్రి పేర్కొన్నారు.

మహిళలు, పురుషులు ఎవరైనా సరే హద్దులు దాటితే దెబ్బతినక తప్పదని మధ్యప్రదేశ్ పరిశ్రమల మంత్రి విజయ్ అన్నారు. అయితే దీనిపై భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంగీకరించట్లేదన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మంత్రిని కోరారు.

దీంతో మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనని క్షమించాలని విజయ్ వార్గియా కోరారు. “నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా ప్రత్యేకించి మహిళల గురించే అనలేదు. ప్రజలు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులు అందరినీ ఉద్దేశించి అన్నాను. అయితే ఒక్క మహిళలకే దాన్ని ఆపాదించారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి ఎలాంతి అభ్యంతరం లేదు” అని మంత్రి విలేకరులతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగి మహిళలపై మంత్రికి ఏమాత్రం సానుభూతి ఉన్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.