Site icon TeluguMirchi.com

Delhi : ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లకు మహిళా అధికారులే


దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తుల నుంచి వివాహాల వరకూ అన్ని రిజిస్ట్రేషన్లను ఇకపై మహిళా అధికారులే నిర్వహించనున్నారు. అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మహిళలనే సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించాలన్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశాలతో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో ప్రస్తుతం 22 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఇప్పటికే అక్కడ ఆరుగురు మహిళా సబ్‌రిజిస్ట్రార్లు ఉన్నారు. గవర్నర్‌ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ సోమవారం మరో 16 మంది మహిళా అధికారులను ఎంపిక చేసి సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించారు.

Exit mobile version