“పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదిని” పురస్కరించుకొని *గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం *గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆకాంక్షించారు*. అంతేకాదు మహిళా ఉద్యోగులంతా విరివిగా మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. స్త్రీలు శక్తిస్వరూపులని, వారు తాము తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళలు, విద్యార్ధిని పాల్గొనేలా తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.
“మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే పుడమి బాగుకోసం అలుపెరగక కృషి చేస్తున్నారన్నారు” ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్”. సాలుమారద తిమ్మక్కగారి స్పూర్తితో ప్రతి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తరువాతి తరాల బాగుకోసం తలపెట్టిన నిస్వార్ధమైన కార్యక్రమమన్నారు ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మంచి ఆశయంలో ప్రతి మహిళా భాగస్వామి కావాలని ఆమె సూచించారు.