Site icon TeluguMirchi.com

3 రోజులు మద్యం దుకాణాలు బంద్


తెలంగాణలోని మూడు జిల్లాల్లో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. నిబంధనలు అతిక్రమించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

Exit mobile version