Site icon TeluguMirchi.com

Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ లు బంద్


ఆంధ్రప్రదేశ్‌లో వైన్స్ షాపులు మూతబడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటితో వైన్స్ షాపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం ముగియడంతో, ఇకపై తమ ఉద్యోగాలు ఉండబోవని భావించిన సిబ్బంది విధులకు హాజరుకాలేదు. ప్రైవేట్ వైన్ షాపులు రానుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని 3240 వైన్స్ షాపులు మూతపడ్డాయి. మద్యం తీసుకోవాలనుకునే వారు బార్లకు మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మరో పది రోజులు షాపులు తెరవాలని కోరినప్పటికీ, ఉద్యోగులు ఆ సూచనను విస్మరించారు. అక్టోబర్ 12న కొత్త మద్యం పాలసీ ప్రకారం కొత్త వైన్ షాపులు వచ్చే వరకు, రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులు బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version