Site icon TeluguMirchi.com

మద్యం ధరలు 30శాతం పెంచుతూ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక ఈరోజు నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. తాజాగా మద్యం ధరలపై పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమం‍త్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను ఏకంగా 30శాతం పెంచుతూ మమత సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా జీవో జారీ చేసింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

Exit mobile version