లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక నిన్నటి నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ నిన్న 25 శాతం మధ్యం ధరలు పెంచింది. అయినాగానీ మందు బాబులు పెంచిన ధరను ఏమాత్రం పట్టించుకోకుండా మద్యం దుకాణాల ముందు భారీ సంఖ్యలో భారులు తీరారు. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసకుంది. మద్యం ధరలు మరో 50 శాతానికి పెంచుతు నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొత్తం 75 శాతానికి మద్యం ధరలు పెరిగాయి. మద్యం దుకాణాలలో పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పెరిగిన ధరలను చూసి మందు బాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.