తెలంగాణ… రేపే విడుదల..!

Digvijay_Singhతెలంగాణ తుది నిర్ణయం రేపే ఉండవచ్చని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఒక టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణకు కట్టుబడి వుందని పేర్కొన్నారు. రేపు జరగబోయే వర్కింగ్ కమిటీలో నిర్ణయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. మొత్తం పరిస్థితిని పరిశీలించి.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్యా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఇది కాంగ్రెస్ లాభమా..? లేక నష్టామా..? అన్నది ముఖ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో1200 కంపెనీల పారా మిలటరీల బలగాలను దించారు. మరో కొన్ని కేంద్ర బలగాలను విజయవాడకు పంపించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో.. రేపు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం జరుగుతోంది. అది పది జిల్లాలతో కూడిన ప్ర్తత్యేక తెలంగాణనా..? లేదా రాయల తెలంగాణ అనే అంశంపై దిగ్గీరాజా స్పష్టత ఇవ్వలేదు. అసలు తెలంగాణ ఇస్తున్నారా..? ఇస్తే పది జిల్లాలతో కూడిన తెలంగాణ లేక రాయల తెలంగాణ అనే విషయం తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.