Site icon TeluguMirchi.com

సమ్మె ఆగదా… ?

apngosఏపీ ఎన్జీవోల సమ్మె పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీ ఎన్జీవోల సమ్మెను సవాల్ చేస్తూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం నమోదైన విషయం తెలిసిందే. అయితే, సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీవోలపై.. సేవా నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు, పర్యావసనాలు ఏమిటీ, సమ్మెపై ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం ఉందా లేదా అన్నదానిపై వివరాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిల్ వేసిన వ్యక్తిని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, రేపు కోర్టు తీర్పు ఎలా వున్నా.. సమ్మెను కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. కోర్టు విచారణను వాయిదా వేసిన అనంతరం సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ సమావేశమయింది. హైకోర్టు తీర్పు ఎలా వుండబోతోంది, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు లో సమ్మెకు చుక్కెదురైతే.. సుప్రీం కోర్టుకు వెళ్తామని ఏపీ ఎన్జీవోలు అంటున్నారు. కాగా, జీతాలు అందకున్నా.. వైద్యబిల్లుల చెల్లింపులు నిలిచిపోయినా.. సమ్మెను మరింత ఉదృతం చేసి తీరుతామని ఏన్జీవోలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version