రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన.. ?

Pranab-Mukherjeeవిభజన నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కూడా ప్రస్తావించారు. నేడు ఏపీఎన్జీవోల సమ్మెపై రాష్ట్ర హైకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. తమ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించామని రాష్ట ప్రభుత్వం చెప్పగా.. గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం పేర్కొంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధిస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం విఫలమైతే కేంద్రం రంగంలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణ విషయంలో వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని తేల్చిచెప్పడం, సీమాంధ్రలో ఆందోళనలు ఇంకా కొనసాగతుండటం చూస్తుంటే.. సమీప భవిష్యత్ లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.