Site icon TeluguMirchi.com

ప్రధాని రాజీనామా.. ?

pmప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయనున్నారనే ప్రచారం గత కొన్నిరోజులుగా జరుగుతోంది. అదీ కూడా యువరాజు రాహుల్ కోసమేనని అంటున్నారు రాజకీయ వర్గాలు. వీలైతే రాజీనామా.. లేదంటే.. 2014 ప్రధాని రేసులో లేనని స్పష్టమైన ప్రకటన చేయడాని మన్మోహన్ రెడీ అయ్యారని కాంగ్రెస్ పెద్దలు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా.. 2014 కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థికి రాహుల్ అన్ని విధాల సమర్థుడనే ప్రకటన మరోసారి చేయనున్నాడని సమాచారమ్.

తాజాగా, ప్రధాని పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధాని ముచ్చటగా మూడోసారి పూర్తిస్థాయిలో విలేకరల సమావేశం నిర్వహించనున్నారు. గతంలో.. కేవలం రెండు పర్యాయాలు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్‌ లో ప్రధాని విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధాని రాజీనామా ప్రకటన, రాహుల్‌ గాంధీకి రంగం సిద్ధం చేసే ప్రయత్నం.. ఇలా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో.. నేటి ప్రధాని ప్రెస్‌మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

నేటి మీడియా సమావేశంలో.. ఎప్పటిలాగే ప్రధాని తమ ప్రభుత్వం గొప్పలను వల్లవేయనున్నారని ప్రచారం జరుగుతోంది.లోక్‌పాల్ చట్టం, అవినీతిని అరికట్టే ఉద్దేశంతో రూపొందిస్తున్న ఇతర ప్రతిపాదిత బిల్లులను, ధరల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. అంతేకాకుండా.. అవినీతి, ఆర్థికవ్యవస్థ, విదేశాంగ వ్యవహారాలు.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రెస్‌మీట్లో ప్రధానంగా ప్రధాని ప్రస్తావించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి నిర్వహించే ప్రెసె మీట్ మన్మోహన్ ఏమి మాట్లాడాతారు.. ? అనే దానిపై కాకుండా.. ఆయన రాజీనామా చేయనున్నారా.. ? లేదా. రాహుల్ రంగం సిద్ధచేయడంపై ఆయన వ్యాఖ్యలు ఎలా వుండబోతున్నాయనే దానిపైనే అందరి దృష్టి కేంద్రికృతం అయింది. మరీ.. మౌనముని మన్మోహన్ మాటలను దేశ ప్రజలంతా ఆసక్తిగా వినడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే.. మళ్లీ మీడియా ముందుకు ప్రధానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని..

Exit mobile version