టీ-బిల్లుపై చర్చిస్తాం : పార్థసారధి

parthsaradiతెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామని స్టేట్ మెంట్స్ ఇచ్చే సీమాంధ్ర నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా చెప్పిన వాళ్లంతా విభజనకు అనుకూలంగా వేటు వేసే అవకాశం వుందదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి మంత్రి పార్థ సారధి వచ్చి చేరారు.

పార్థసారధి ఈరోజు (మంగళవారం) విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. అయితే, అభ్యంతరాలు, వ్యతిరేకతపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తామని ఆయన తెలిపారు. అంటే.. మంత్రి పార్థసారధికి అధిష్టాన మాటకు కట్టుబడి వున్నాను అనే చెప్పేందుకు గానూ తాజా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే, మంత్రులు మాణిక్య వరప్రసాద్, కొండ్రుమురళిలతో పాటుగా, పలువురు నేతలు అధిష్టానం ఆజ్జకు అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక, బిల్లుపై ఓటింగ్ అనివార్యమని తేలితే ఈ లిస్టులో మరికొందరు నేతలు వచ్చిచేరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి.. సీమాంధ్ర నేతలు మెత్తబడి అధిష్టానం దారిలోకి వస్తున్నారన్న మాట.