Site icon TeluguMirchi.com

‘టీఆర్ ఎస్’ అధ్యక్షుడు ఎవరు ?

TRS1టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అని మాకు తెలుసునండీ. కాకపోతే ప్రతి రెండు సంవత్సరాలకోసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం తెరాస ఆనవాయితి మరి. తాజాగా తెరాస అధ్యక్ష పదవి ఎన్నికలకు ఆ పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం రేపటినుంచి అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. 25న నామి నేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 27న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు జరిగే పార్టీ ఆవిర్భావ సభలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకవేళ ఒకరికి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్లయితే… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఎన్నిక ప్రక్రియ ఉంటుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ ఎన్నికలకు అధికారిగా టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహరెడ్డి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పాత అధ్యక్షుడే అయినా.. కొత్తగా ఎన్నికుంటే.. కిక్ ఉంటుందని తెరాస శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version