ఒమిక్రాన్ వేరియంట్, డబ్ల్యుహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రధానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ సంఖ్యను మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేరియంట్లను కొన్ని దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోందని ఇలాంటి పరిణామాలు మంచివి కావని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండేలా ఈ క్షణం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన సంవత్సరవేడుకల్లో ప్రజలు గుంపులుగా గుమికూడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని అథనం పిలుపునిచ్చారు.