Site icon TeluguMirchi.com

ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ఆగేదెన్నడూ ?


ఉక్రెయిన్, రష్యా మధ్య గత ఏడాది నుంచి యుద్ధం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. సైనిక, ఆయుధ సంపత్తిని భారీగా కోల్పోయాయి. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ యుద్ధానికి ఇప్పట్లో పుల్‌స్టాఫ్ పెట్టే సూచనలు కనిపించడం లేవు. ఉక్రెయిన్‌కు ఇంగ్లాండ్, అమెరికా , ఫ్రాన్స్ వంటి దేశాలు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఉద్దీపన ప్యాకేజీలు ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, గ్యాస్, ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. యుద్ధం ఆపాలని ప్రపంచదేశాలు చెప్పినా రష్యా , ఉక్రెయిన్ దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ నాటో దేశాల్లో చేరకూడదని, డాన్‌బాస్కోకు ఇండిపెండెన్స్ ఇస్తామని ఖచ్చితమైన ప్రకటన ఇస్తేగానీ యుద్ధం ఆపే ప్రసక్తే లేదని రష్యా చెబుతోంది. ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాకు వస్తున్న ఆదాయాన్ని స్తంభింపజేశాయి. ఆయినా పుతిన్ తన ఆయుధాలతో ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూవస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగే రానున్న రోజుల్లో నాటో దేశాలపై రష్యా దాడి చేసే అవకాశాన్ని కోట్టిపారేయలేం. ఎందుకంటే నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నాయి. రష్యా ఆయుధ సంపత్తి నిండుకున్నాయి. చైనా గనుక రష్యాకు ఆయుధ సాయమందిస్తే అది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. ఇప్పటికే రష్యాకు సాయం అందించవద్దని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. చైనాపై తీవ్ర ఆంక్షలు విధిస్తామని చెప్పింది. ఇప్పటికే ఉత్తరకొరియా రష్యాకు ఆయుధ సాయం అందిస్తామని ప్రకటించింది. రష్యా చివరి ప్రయత్నంగా అణుదాడికి ప్రయత్నించాలని అనుకుంటుంది. రష్యా ఆలోచనను మందుగానే ఊహించిన భారత్.. అలాంటి ప్రయత్నాలు చేయవద్దని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం తీసుకురావాలని పుతిన్‌కు సూచించింది. ప్రస్తుతం జీ20 దేశాల అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేయాలని అగ్రరాజ్యం కోరుకుటుంది. మరి భారత్ ఇరు దేశాలతో చర్చించి శాంతి దిశగా ప్రయత్నిస్తుందో చూడాలి.

Exit mobile version