వైకాపాను 2019 ఎన్నికల్లో విజయ పథంలో నడిపిస్తాను అంటూ ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా అధినేత వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడేం చేస్తున్నాడు అంటూ ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత పీకే చేస్తున్న పనేంటి అంటూ పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్లు ఇచ్చి పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంటే ఆయన చేస్తున్నది ఏంటి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న పనులు ఏమీ కూడా కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కాదని, కాని పీకే మాత్రం సోషల్ మీడియాలో వైకాపాకు ఫాలోవర్స్‌ను పెంచే పనిలో ఉన్నాడు తప్ప గ్రౌండ్ స్థాయిలో పరిస్థితిని ఆయన అర్థం చేసుకుని, చేయాల్సిన పనులను చేయడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
మరి కొందరు మాత్రం పీకేకు ఏం చేయాలో బాగా తెలుసని, అతడు 2019 ఎన్నికలు టార్గెట్‌గా పని చేస్తున్నాడని, మద్యలో ఈ ఎన్నికలు ఓడిపోయినంత మాత్రాన ఆయన్ను విమర్శి:చడం పద్దతి కాదు అంటున్నారు. పీకే ప్రభావం 2019లో కనిపిస్తే ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరగడం ఖాయం.