Site icon TeluguMirchi.com

బీజేపీ టీ-స్టాండ్ మారనుందా.. ?

bjpp (1)ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజాపా సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. టీ-విషయంలో భాజాపా బలంగా మద్దతు పలుకుతోంది. ఆ పార్టీ సీమాంధ్ర నేతల నుంచి కాస్తో కూస్తో.. నిరసనలు వెలువడ్డప్పటికినీ టీ-విషయంలో భాజాపా గట్టిగా మద్దతు పులుకుతూ వస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణ ను ఏర్పాటు చేయని యెడల 100రోజుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలంతా ప్రకటించారు.

అయితే, తాజాగా, టీ-విషయంలో భాజాపా వైఖరి మారినట్లు సమాచారం. మారిన భాజాపా స్టాండ్ ను ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు వెల్లడిస్తాడని తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న ఆ పార్టీ సీమాంధ్ర కార్యకర్తలను ఉద్దేశించి ఈరోజు (సోమవారం) వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ తరపున ఓ ప్రకటన చేయనున్నారని సమాచారమ్.

ఇన్నాళ్ళు తెలంగాణకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వస్తున్న భాజాపా తన వైఖరిని మార్చుకుంటుందా.. ? లేదా.. తెలంగాణ ఏర్పాటు తో పాటుగా సీమాంధ్ర సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తుందా.. ? అన్నది ఉత్కంఠంగా మారింది. ఏదేమైనా.. తెలంగాణ ఏర్పాటు భాజాపా తీసుకునే స్టాండ్ పై ఆధారపడివుందన్నది వాస్తవం. మరీ.. వెంకయ్య ప్రకటించబోయే న్యూ స్టాండ్ ఎలా వుండబోతోందో తెలియాలంటే మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే..

Exit mobile version