విజయమ్మ మాటల వెనుక వైనమేమి?

vijayamma_వైకాపా అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తొలిసారి ఒక చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె వెల్లడించిన భావాలు, చెప్పిన సమాధానాలు చూస్తుంటే భలే చిత్రంగా వుంది. నిజానికి ఇలా తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాజకీయ నాయకులు సహజంగా కొంత మైలేజి ఆశిస్తారు. కానీ ఇక్కడ విజయమ్మ రాజకీయనాకురాలు కానే కాదు. భర్త వున్నంత కాలం ఆమె ఇంటికే పరితమయ్యారు. కొడుకు జగన్ జైలుపాలవడంతో, పార్తీ బరువు కొంతయినా మోయకతప్పలేదు. అయితే అది ఇష్టంగా మోయడం వేరు, తప్పనిసరై మోయడం వేరు. జగన్ సోదరి షర్మిల ఇష్టంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తల్లి విజయమ్మ చాలా కష్టంగా ఫీలవుతున్నట్లు ఇంటర్వ్యూ గమనిస్తే అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో తెలివైన సమాధానాలు చెప్పాలి, పార్టీ క్యాడర్ కు బలం, ఊతం ఇవ్వాలి తదితర వ్యవహారాలను ఆమె పట్టించుకోలేదు. పైగా ఏదీ దాచాలనీ ప్రయత్నించలేదు. వాళ్లు.. అడిగారు. ఆమె నిజాయితీగా చెప్పారు అన్నట్లు సాగింది. తాను తప్పని సరై బరువు మోస్తున్నానని ఆమె అంగీకరించారు. పార్తీ బలహీనతలు అంగీకరించారు. కానీ ఆమె విశ్వాసం ఒక్కటే. జగన్ ను ఎవరు ఏమీ చేయలేరని, ఏ ఎన్నికలైనా గెలుపు తమదేనని, ప్రతిపక్షాలకు ఏమీ లేకనే తన బొట్ట్ము, తన బైబిల్ పై దృష్టిపెడుతున్నారని అనడం మాత్రం బాగా లేదు ఎందుకంటే ఇంట్లో వున్నంత సేపు ఎవరి ఇష్టం వారిది. ప్రజల కోసం పబ్లిక్ లోకి వచ్చినప్ప్పుడు, ప్రత్యర్థులు ఎలాగైనా విమర్శిస్తారు. తట్టుకుంటేనే రాణిస్తారు. కానీ కాలపరిస్థితుల రీత్యా, కాలం కలసి రాక, పార్టీ పగ్గాలు చేపట్టిన విజయమ్మ, అలా తట్టుకోగలరా? ఇప్పటికే ఆమె చాలా నీరసిస్తున్నట్లు ఆమె మాటలు చెబుతున్నాయి. జగన్ బాబు వచ్చేవరకు ఆమె, ఆమె పార్టీ బలంగా వుండగలవా? ఏమో.. సందేహమే.