Site icon TeluguMirchi.com

Weather Update : ఏపీలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన


ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అప్రమత్తంగా ఉండండి. దయచేసి వ్యవసాయ మరియు ఉపాధి పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్ క్రింద ఉండకండి. పొలాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి.

Exit mobile version