మాతెలంగాణ మాగ్గావాలె..!

tjacఒకవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం… మరోవైపు హైదరాబాద్ ను ప్రత్యేక పాలకమండలిగా చేస్తారంటూ లీకులు… లేదు కేంద్రపాలితమంటూ ఊహాగానాలు… కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టంచేసింది.ఇక మిగిలిందంతా హైదరాబాద్ అంశమే.  పైగా ఏపీఎన్జీవోలు హైదరాబాద్ లో సభ నిర్వహించడంతో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. దీంతో టీజేఏసీ హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించలేమంటూ ప్రకటనలు చేయడం మొదలుపెట్టింది. చేతులు కాలకముందే ఏదైనా చేయాలనుకుందేమో టీజేఏసీ.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 30న సభను హైదరాబాద్ లో సభను నిర్వహించాలని ఆలోచిస్తోంది.

సభ జరపాలనే నిర్ణయం దాదాపుగా ఖరారైనట్లే.. అయితే కేవలం సభనిర్వహిస్తే సరిపోదు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచన వారిలో ఉంది. అందుకే ఈరోజు జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావడం… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగంవంతం చేసే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించనున్నారు. ఇప్పటికే సద్భావన సదస్సుల పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మరి ముందుముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నదానిపైనే చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉద్యమాన్ని ఒక ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లిన ఉద్యమసారథి మరి ఇకముందు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళతారో.