కేకేది వ్యూహాత్మకమేనా?

K-Kesava-Rao-Makes-Controversial-Comments-on-Congress-Party-172సీనియర్ కాంగ్రెస్ నేత,సోనియా గాంధీకి లాయల్టీగా ఉండే మాజీ పీసీసీ అధ్యక్షులు కే. కేశవరావు టీఆర్ ఎస్ చేరడం వ్యూహాత్మకంగా జరిగింది. ఇప్పటి పరిస్థితులను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. కాంగ్రెస్ లో ప్రధాన పదవులను అనుభవించిన కేకే టీఆర్ ఎస్ లో చేరడానికి వారం రోజుల ముందే సోనియాతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో ఎంతో భవిష్యత్ ఉన్న కేకే ఒక్కసారిగా టీఆర్ఎస్ లో చేరడం వ్యూహాత్మకమే అనిపిస్తోంది. ఢిల్లీ పెద్దలే కేకేను టీఆర్ ఎస్, కాంగ్రెస్ కు మధ్య వారథిగా పంపినట్లు కాంగ్రెస్ లోని ఓ వర్గం విమర్శలు చేస్తోంది. అందుకే టీఆర్ ఎస్ నేతలెప్పుడూ కేకే పార్టీలో చేరిన తరువాత సోనియాను గానీ, కాంగ్రెస్ పార్టీని గానీ పల్లెత్తు మాట అనలేదు. వారి టార్గెట్ అంతా చంద్ర బాబుపైనే అని స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు కేకే కు తెలయడం వల్లనే టీఆర్ ఎస్ సైతం గత కొద్ది రోజులుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్ర కాంగ్రెస్ కు, సీఎంకు కూడా తెలియని ఢిల్లీ విషయాలు టీఆర్ ఎస్ నాయకులకు తెలియడం ఈ వాదనను బలపరుస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు కేకే కీలక పాత్ర పోషిస్తారా? లేక తెలంగాణలో టీఆర్ ఎస్ జెండా ఎగురవేస్తారా ? చూడాలి మరి.