Site icon TeluguMirchi.com

వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు

వరంగల్ అర్బన్ జిల్లా పేరును ఇకపై హన్మకొండగా మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కెసిఆర్… వెటర్నరీ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలను శంకు స్థాపన చేశారు. రెండు రోజుల్లో హన్మకొండ జిల్లా పేరు మార్పుపై ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 57 కోట్ల రూపాయలతో నిర్మించిన హన్మకొండ జిల్లా కొత్త కలెక్టరేట్ భవనానికి సీఎం ప్రారంభోత్సవం చేశారు. వరంగల్ సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలోని 60 ఎకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు. 24 అంతస్తుల ఈ ఆస్పత్రిని 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ కొత్త ఆస్పత్రిలో సేవలు అందించనున్నాయి.

Exit mobile version