Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మాటల యుద్ధం.. పై చేయి ఎవరిదో ?


ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హాట్ టాపిక్ – పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్. తిరుమల లడ్డూ అంశం పై మొదలైన మాటల యుద్ధం కాస్తా రోజుకో ట్వీట్, పూటకో రియాక్షన్‌తో మరింత ఉధృతమవుతోంది. “జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాశ్ రాజ్ పవన్‌ను కౌంటర్ చేస్తూ, ప్రతి రోజు కొత్తగా చురకలు అంటిస్తున్నారు. ఈ వార్ డైరెక్ట్ అటాక్స్ లా మారడంతో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై పవన్ చేసిన కామెంట్స్, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం రీల్ శత్రుత్వం మాత్రమే కాదు, రియల్ ఫైట్‌గా మారింది. గతంలో ఇద్దరూ సినిమాల్లో నటించినప్పుడు డైలాగ్ వార్ లను పంచుకున్నా, ఇప్పుడు ఇది నిజ జీవితంలోకి మారి, ప్రతి ట్వీట్ కొత్త సంచలనంగా మారుతోంది.

జనసేన, బీజేపీతో పవన్ కలిసిన తరువాత, ప్రకాశ్ రాజ్ ఆయనను టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీనికి తిరుమల లడ్డూ కల్తీ కేసు ఒక మజిలీగా మారింది. పవన్ దీక్ష చేపట్టగా, విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్ అక్కడ నుంచే “జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్‌కు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. ఇద్దరు స్టార్‌లు కావడం వల్ల, వారి ట్వీట్లు మరియు డైలాగ్ యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ వాగ్వాదంలో పాల్గొంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

Exit mobile version