ఇక వాల్డ్‌ డిస్నీ వంతు, 7 వేల మంది ఉద్యోగుల కోత!


వినోద రంగంలో రారాజుగా వెలుగుతున్న వాల్డ్‌ డిస్నీ తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 5.5 బిలియన్ల ఖర్చులను ఆదా చేయడానికి, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంలో భాగంగా కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నామని సంస్థ సీఈవో బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని చెప్పారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలతోపాటు బోయింగ్‌ వంటి విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధించిన సంగతి తెలిసిందే.