దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేంద్రం మే 03 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు ఆంధ్ర బార్డర్ లో గోడలు నిర్మించడం వివాదాస్పదంగా మారింది.
చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్ దగ్గర.. బొమ్మసముద్రం దగ్గర నేషనల్ హైవేపై.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలో.. రోడ్డుకు అడ్డంగా తమిళనాడు అధికారులు సిమెంటు గోడలు కట్టించారు. ఇలా మూడు చోట్ల రోడ్లపై గోడలు కట్టడం వివాదాస్పదం అయ్యింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైన రహదారుల్లో ఇలా గోడలు కట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ గోడలు కట్టడంపై ఏపీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏపీ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు వారు ఇటూ, ఇటువారు అటు వెళ్లకుండా ఉండేదుకు గోడలు కట్టారని అంటున్నారు.