సీఎం తీర్మాణంపై ఓటింగ్.. ??

Assemblyరాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించాలంటూ.. సభాపతి నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మాణం ఇప్పుడు కేంద్రానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. సీఎం తీర్మాణంను సభ ఆమోదిస్తే టీ-ప్రక్రియలో కొత్త చిక్కులు ఏర్పడే అవకాశం వుంది. తద్వారా.. టీ-ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ వుంది. నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం తీర్మాణంపై ఓటింగ్ చేపట్టాల్సి వుంటుందని స్వీకర్ పేర్కొనడంపై టీ-నేతలు టెన్షన్ పడుతున్నారు. యూపీ, బీహార్‌ లలో తీర్మానంతోనే జరిగిన ఓటింగ్‌ ను స్వీకర్  ఉదాహరించారు. స్వీకర్ వ్యాఖ్యలను టీ-నేతలు ఖండించారు. సీఎం వ్యక్తగతంగా తీర్మాణాన్ని ఇచ్చారని.. దానికి టీ-మంత్రుల ఆమోదం లేదని వాదిస్తున్నారు.

సీఎం తీర్మాణంపై ఓటింగ్ జరగకపోతే సరి. మిగిలిన కథ మేం చూసుకుంటామని కేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సభ సాగే పరిస్థితే లేనందున.. ఇక బిల్లుపై అసెంబ్లీ కథ ముగిసినట్లేనన్నది కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పుడు సీఎం తీర్మాణంపై స్వీకర్ నిర్ణయమే కీలకం కానుంది. సీఎం తీర్మాణాన్ని స్వీకర్ ఓటింగ్ కు అనుమతినిస్తారా.. ? లేదా.. ? అన్నది ఆసక్తిగా మారింది. అసెంబ్లీ జరిగే ఈరెండు (ఈరోజు, రేపు)రోజులు చాలా కీలకం కానున్నాయి. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నేతలు ఎవరికి వారుగా వారి వారీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరీ.. టీ-సమరంలో గెలిచేదెవరు.. ? ఓడెదెవరు.. ? అనేది తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే..