విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు ఈ రోజు ఒక కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మృతదేహం తరలింపునకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ దొర,హెచ్‌సీ మసేను,కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు చూపిన మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.