Site icon TeluguMirchi.com

వైజాగ్ ఎంపీ మళ్లీ వైసీపీదే ?


వైజాగ్ లోక్ సభ ఎన్నికల్లో మండే ఎండలను సైతం లెక్కచేయకుండా వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు.

ఇక ఏసీ రూమ్ ల్లో కూర్చుని సాయంత్రమైన తర్వాత చల్లగాలిలో కూటమి అభ్యర్థి మెతుకుమిల్లి భరత్ ప్రచారానికి వచ్చి, నాలుగు కబుర్లు చెప్పి ఎళ్లిపోతున్నాడు. ఎక్కడా కూడా విశాఖకు తానేం చేస్తాడో చెప్పలేకపోతున్నాడు. సరైన హామీలు ఇవ్వలేక పోతున్నాడు. కేవలం తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనే సంగతి ప్రజలందరికీ అర్థమైంది.

ఇప్పటికే విద్యా సంస్థల పేరుతో చేసిన అక్రమాలు, ఆక్రమణలను కాపాడుకోవడానికి బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా సీటు తెచ్చుకుని బరిలోకి దిగాడు. స్వలాభంతో చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ మంచేదో, చెడెదో తెలుసుకుంటున్నారు. అందుకనే వైజాగ్ ఎంపీ స్థానం ఈసారి వైసీపీదేనని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.

ఇక మెతుకుమిల్లి భరత్ కుటుంబం వైజాగ్ లో ఇప్పటివరకు 8 సార్లు పోటీ చేశారు. కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తరువాత 10 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది కేవలం మూడు సార్లు మాత్రమే.

వైజాగ్ టీడీపీకి ఏమాత్రం కంచుకోట కాదు. ఇలాగే డబ్బా కబుర్లు కొట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతుంటాడు. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. 1987 తరువాత వైజాగ్ కార్పొరేషన్ లో ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు. మరింకెందుకు ఈ అసత్యపు ప్రచారం, బూటకపు కబుర్లు అని సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా నిజాలు చెప్పమని చంద్రబాబుని అడుగుతున్నారు.

1995, 2000లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా. వైజాగ్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు. అందుకని ఈ కాకమ్మకబుర్లన్నీ చెవిలో పువ్వులు పెట్టుకున్నవాళ్లకి, మెహర్బానీ బ్యాచ్ లకి చెప్పుకోండి కానీ, తెలివైన విశాఖ వాసుల దగ్గర కాదు. వారి దగ్గర పిల్లి మొగ్గలు వేయవద్దని తెలుగుదేశం నేతలకి వార్నింగు ఇస్తున్నారు.

Exit mobile version