కేసీఆర్ సర్కార్ కు విశ్వ ప్రసాద్ భారీ సాయం..

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్నసంగతి తెలిసిందే.

ఇప్పటికే చాలామంది పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటి తమ గొప్ప మనసు చాటుకోగా..తాజాగా ప్రముఖ నిర్మాత మరియు వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు రూ.25 లక్షల చెక్ ను విరాళంగా అందించారు.

ఈ సందర్భాంగా విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్పంచించాలి అని తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది విశ్వ ప్రసాద్ తెలిపారు. అందుకే కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించామని తెలియజేసారు.