ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం, పర్యాటకులకు అనుమతి నిషేధం

విశాఖపట్నం లోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకుల అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.