పంచాయితీ ఎన్నికల్లో హింస !

westbangel-electoinsపశ్చిమ బెంగాల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్యగొడవ రాజుకుంది. పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లోనే ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. బురుద్వార్‌ పోలింగ్ బూత్‌పై బాంబులతో దాడి చేయగా,సిపిఎం తరఫున బరిలోకి అభ్యర్థి భర్త మృతి చెందాడు. ఆ తరవాత దాడికి పాల్పడిన దుండగుల్లో ఒకరిని గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు. తీవ్రంగా
గాయపడిన దుండగుడు కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో రెండవ దశ ఎన్నికలు జరుగుతున్న మూడు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయిన ప్రభుత్వంపై సర్వత్రా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.