Site icon TeluguMirchi.com

ఎన్నికల కోడ్ గవర్నర్‌కు కూడా

narasimhhaఎన్నికల కోడ్ కు గవర్నర్ కూడా అతీతుడు కాదని, అతనికి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జస్టి అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనేనన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈసీ అనుమతితో సంబంధిత అధికారులతో సమీక్ష జరపవచ్చన్నారు. కొత్త పార్టీల రిజిస్ట్రేషన్‌కు పెద్దగా సమయం పట్టదని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేస్తే కొద్ది సమయంలోనే పార్టీ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయన్నారు.

Exit mobile version