కరోనాను పట్టించుకోకుండా గ్రామ వాలంటీర్ల పార్టీ..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాకూడదని..విందు వినోదాలకు పాల్పడకూడదని ప్రభుత్వాలు చెపుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు మాత్రం అవేమి పట్టించుకోకుండా రోడ్ల పైకి వస్తూ నానా రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది గ్రామ వాలంటీర్లు పార్టీ చేసుకోవడం చర్చ కు దారితీసింది. విశాఖలోని ఏటికొప్పాకకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ పుట్టినరోజు కావడంతో మామిడి తోటలో పార్టీ పార్టీ ఇచ్చాడు. తనతో పాటుగా పనిచేస్తున్న 11 మంది గ్రామ వాలంటీర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. మామిడి తోటలో ఏర్పాటు చేసిన విందులో వీళ్ళు పాల్గొన్నారు. సామజిక దూరం పాటించలేదు. ఒకచోట గుంపుగా కూర్చొని పార్టీ చేసుకొని ఫోటోలకు పోజ్ ఇచ్చారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అవి వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఒక చోటకు చేరి ఇలా పార్టీ చేసుకున్నందుకు వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.