దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడ నగర కమీషనర్ ఆదేశాలమేరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మరియు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి మాస్కు లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఆదివారం (21-03 -2021) మాస్కు లు లేనివారిపై మొత్తం 217 కేసులు నమోదు చేసి రూ.20,550 జరిమానా విధించారు. విజయవాడ నగర ప్రజలు బయటకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.