విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. భవానీ దీక్షల విమరణ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషన్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. గిరి ప్రదక్షిణలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు మరమత్తులు చేశామన్నారు. 4 లక్షల మంది భవానీలు దీక్ష విమరణకు వస్తారనే అంచనాల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.