Site icon TeluguMirchi.com

తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు

దసరా మహోత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గ గుడిలో జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14న ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌పై దేవస్థానం EE భాస్కర్‌ మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. హంస వాహనం ఇప్పటికే సిద్ధమవగా, వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు.

తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ఇరిగేషన్, R&B శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణానదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు.

Exit mobile version