ఈమద్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంటున్న విజయశాంతికి త్వరలోనే ఒక కీలక పదవి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్రంను బతికించుకునేందుకు ఏదైనా సాహస నిర్ణయం తీసుకోవాలనుకున్న అధినాయకత్వం కొత్త టీ పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. అందుకు గాను పలువురి పేర్లను పరిశీలించి చివరి జాబితాలో విజయశాంతి పేరును కూడా చేరినట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఆమె అధిష్టానంను ఒప్పించేందుకు మెప్పించేందుకు గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్ మరియు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై, కేసీఆర్ ప్రతి కదలికపై విజయశాంతి విమర్శలు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో లేదంటే డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి ఆమె వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆమెకు త్వరలో అధినాయకత్వం కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఆమె ఈమద్య వరుసగా ప్రభుత్వం విమర్శలు చేస్తుందని, అలా చేయడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లలో కూడా తనపై నమ్మకం కలుగుతుందని ఆమె భావిస్తోంది.