గత కొద్దీ రోజులుగా గంటా శ్రీనివాస్ రావు వైసీపీ పార్టీ లో చేరబోతారనే వార్తల ఫై విజయసాయి స్పందించారు. ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విజయసాయి..గంటా ఫై కాస్త ఘాటు వాక్యాలే చేసారు. గెలిచిన తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకు అలవాటని.. ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని ఎద్దేవా చేశారు. ఆయన్ను వైఎస్సార్సీపీలో చేర్చుకునే పరిస్ధితి లేదన్నారు.
గంటాను పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ అవాస్తవాలేనని.. ఆయనను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓడిపోయినా కేకే రాజు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. ఈ నియోజకవర్గంలో ప్రజలు గంటాను గెలిపించారని.. ఆయన మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నారని ఆరోపించారు. గెలిచిన గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నారో తెలియదు.. అదే ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు.