Site icon TeluguMirchi.com

విజయమ్మ లేఖాస్త్రం !

vijayammaశాసనసభలో గతకొద్దిరోజులుగా సమైక్యాంధ్ర తీర్మాణానికి పట్టుబడుతూ వస్తోంది వైకాపా. అయితే, సమైక్య వాయిదా తీర్మాణాలను ఎప్పటికప్పుడు స్వీకర్ తిరస్కరిస్తూ వస్తున్నాడు. ఎలాగైనా.. టీ-బిల్లుపై చర్చ సాగకుండా చూసి.. సమైక్య ఛాంపియన్ గా వెలుగొందాలని చూస్తున్న వైకాపాకు మరోదరి దొరికిందే. అదే.. బిల్లులో పొర్లిన తప్పుల తడక. అవును.. ఇప్పుడు వైకాపా ఇదే అస్త్రాన్ని వినియోగించుకొని టీ-బిల్లుపై చర్చను జాప్యం చేయాలని
యోచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ..ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్వీకర్ నాదేండ్ల మనోహర్ కు లేఖాస్త్రాన్ని సంధించారు.

శాసన సభలో ప్రవేశపెట్టిన ’తెలంగాణ ముసాయిదా బిల్లు’ స్పష్టంగా లేదని, తెలుగు అనువాదంలో కూడా చాలా తప్పులు దొర్లాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. స్పష్టంగా లేని బిల్లుపై సభలో ఎలా చర్చిస్తారని విజయమ్మ ప్రశ్నించారు. బిల్లులోని అక్షర దోషాలను సవరించిన తరువాతనే చర్చ జరపాలని ఆమె శాసన సభాపతిని డిమాండ్ చేశారు.

మొత్తానికి.. దారి ఏదైతేనేం.. క్రిడెట్ దొబ్బేసేమా లేదా… అన్నట్టు ప్రవరిస్తుంది వైకాపా. అందుకే.. సమైక్యాంధ్ర తీర్మాణ దారిని వదిలేసి, బిల్లులోని తప్పుల దారిని ఎంచుకొంది.

Exit mobile version